సంక్రాంతి తర్వాత గ్రామాలకు పవన్ పర్యటన..! 5 h ago
AP : గ్రామాల పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నారు. సంక్రాంతి తర్వాత గ్రామాలను పర్యటించనున్నారు. ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు. పల్లెల్లో టెంట్.. అందులోనే క్యాంపు కార్యాలయం అని అన్నారు. అధికారులు సైతం టెంట్లోనే ఉండి గ్రామ ప్రజలకు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. పల్లెల్లో పవన్ పర్యటనకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి పర్యటన ఉండే అవకాశం అని సమాచారం.